జాతీయ ఔషధ మొక్కల సంస్థ(ఎన్.ఎం.పి.బి)


భారత ప్రభుత్వం చేత నవంబర్ 2000 సంవత్సరంలో స్థాపించబడిన జాతీయ ఔషధ మొక్కల సంస్థ దేశ ఔషధ మొక్కల రంగ అభివృద్ధికి తోడ్పడుతుతోంది. ఇందుకోసం ఈ సంస్థ వివిధ మంత్రిత్వశాఖలు / విభాగాలు / సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయం కోసం తగిన యంత్రాంగాలను నిర్వర్తించడం, ఔషధ మొక్కల పెంపకం మరియు అభివృద్ధి కోసం వివిధ పద్ధతులు / కార్యక్రమాలను అమలు చేయడం వంటివి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం.

ఎన్.ఎం.పి.బి - ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటు


జాతీయ ఔషధ మొక్కల సంస్థ వివిధ కార్యక్రమాల సమన్వయం కొరకు, దేశంలోని వివిధ ప్రదేశాలలో ప్రాంతీయ కేంద్రాలు స్థాపించబడ్డాయి. దక్షిణ భారతదేశంలోని కేరళ అటవీ పరిశోధనా సంస్థ (కె.ఎఫ్.ఆర్.ఐ)యందు ప్రాంతీయ మరియు సహకార కేంద్రం - దక్షిణ ప్రాంతం (ఎన్.ఎం.పి.బి -ఆర్.సి.ఎఫ్.సి దక్షిణ ప్రాంతం ) ఏర్పాటు చేయబడింది.

ఎన్.ఎం.పి.బి - ఆర్.సి.ఎఫ్.సి కార్యాచరణ (దక్షిణ ప్రాంతం)


దక్షిణ ప్రాంతంలో ఉన్న ఔషధ మొక్కల రంగానికి సంబంధించిన అన్ని లావాదేవీలకు ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తోంది. ఇందులో కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు మరియు కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షద్వీప్, పాండిచ్చేరి మరియు అండమాన్ & నికోబార్ దీవులు ఉన్నాయి.

Project Partners

Medicinal Plants Gallery

ఎన్. ఎమ్. పి. బి - ఆర్. సి. ఎఫ్. సి. లక్ష్యాలు :

  • ఎన్.ఎమ్.పి.బి సంస్థ నిర్వహించే అన్ని కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందించడం.

  • దక్షిణ భారత దేశంలోని ఔషధ మొక్కల రంగానికి సంబంధించిన అన్ని సంస్థలతో సంప్రదించడం మరియు సంస్థ నిర్వహించు అన్ని కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం.

  • నాణ్యమైన నారు మొక్కల(క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ : QPMs)ను ఉత్పత్తి చేయడంలోనూ, మొక్కల సాగు, పరిరక్షణ, దిగుబడి, ఉత్పత్తులను ముడి ఔషధాలుగా మార్చడం మరియు అదనపు ఉపయోగాలు, నిల్వ, క్రయవిక్రయాలు మరియు నాణ్యతా నియంత్రణ మొదలగువాటిలో వాటాదారులకు తగిన నిర్వహణ మరియు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేయటం.

  • ఔషధ మొక్కల రంగంపై సదస్సులు మరియు సమావేశాలు నిర్వహించడం, అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వటం, వీటి కొరకు సాంకేతిక మరియు ఆర్థిక సహకారాలు అందించడం.

  • వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వాణిజ్యపరంగా గిరాకీ ఉన్న ఔషధ మొక్కలను పెంచటం మరియు అంతరించిపోతున్న ఔషధ మొక్కల జాతులను రక్షించడం.

  • ఆయా ప్రాంతాల్లో పండించే ప్రత్యేక పంటల కోసం నాణ్యమైన విత్తనాలను మరియు నారును సరఫరా చేయటం.

  • ఉత్పత్తి చేసిన ఔషధాలకు మార్కెటింగ్ సులభతరం చేయటం.

  • ఎన్.ఎమ్.పి.బి చేత గుర్తించబడిన ప్రధాన ప్రాంతాల్లో వివిధ సంస్థల ద్వారా పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం.

  • ఎన్.ఎమ్.పి.బి సమర్థవంతంగా పూర్తి చేసిన ప్రాజెక్ట్/కార్యక్రమాలు అన్నింటిని సేకరించి, వాటి గురించి విజయగాథలుగా ప్రచారం చేయడం.